బాన్సువాడలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర శుక్రవారం పట్టణంలో పర్యటించారు. గణేష్ మండపాలను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ శుక్రవారం బాన్సువాడలో పర్యటించి, గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడి భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాత బాన్సువాడ చావిడి నుంచి సంగమేశ్వర్ కాలనీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, తాడుకోల్ చౌరస్తా, గాంధీచౌక్, జండాగల్లి మీదుగా కల్కి చెరువు వరకు రూట్‌ను పరిశీలించారు. రోడ్ల పరిస్థితి, విద్యుత్ వైర్లు, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.












