జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరుగుతున్న విచారణను స్థానిక అధికారులతో కాకుండా, ఇతర జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులతో నిర్వహించాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కమలాకర్ నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లిలో నిరసన తెలిపారు.
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణను కింది స్థాయి అధికారులతో కాకుండా ఉన్నతస్థాయి, ఇతర జిల్లాలకు చెందిన విద్యాశాఖ అధికారులతో నిర్వహించాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కమలాకర్ నాయుడు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంగళవారం మదనపల్లిలోని డీఈఓ కార్యాలయం ఎదుట యూఎస్ఎఫ్ఐ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. వారు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని, చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. విచారణలో పారదర్శకత, నిష్పక్షపాతం లోపించిందని ఆరోపించారు.












