అమరుల త్యాగాల స్ఫూర్తితో ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ముందుకు సాగాలని జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ పిలుపునిచ్చారు. జమ్మలమడుగులో 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దనూరు రోడ్డులోని స్థూపం వద్ద జిల్లా కార్యదర్శి శివకుమార్ జెండా ఆవిష్కరించారు.
1980లో పంజాబ్‌లో ఏర్పాటైన నేడు దేశంలోనే కోటి సభ్యత్వంతో అతిపెద్ద యువజన సంఘంగా ఎదిగిందని ఆయన తెలిపారు. అందరికీ విద్య, అందరికీ ఉపాధి లక్ష్యంగా పోరాటాలు నిర్వహిస్తున్నామని, ఈ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేశ ఐక్యత, మత సామరస్యం కోసం పోరాడుతుందని ఆయన తెలిపారు. దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోందని, పాలకులు యువతకు ఇచ్చిన వాగ్దానాలను మరిచారని ఆయన విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో చిన్న, కుటీర పరిశ్రమలను మూసివేసి, లక్షల మంది యువత ఉపాధి కోల్పోయేలా చేశారని ఆయన అన్నారు.











