తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి నిధులు సమకూర్చే ఏటీఎంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన లోక్తంత్ర బచావో అరాజకతా హటావో పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చారని, వాటిలో ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని అమిత్ షా విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులకు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను క్షమించరని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అవినీతిపై బీజేపీ వైఖరి
తెలంగాణలో అవినీతిని అరికట్టడం, రాష్ట్రాన్ని అమ్ముకునే కుట్రలను ఆపడం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల వల్ల కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ మాత్రమే అవినీతిని అడ్డుకోగలదని ఆయన అన్నారు.











