కామారెడ్డి, 2026-07-28
భారతరత్న, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
భారతరత్న, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలోని సదాశినగర్ మండలంలో గల వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో సహ చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం, కామారెడ్డి జిల్లా ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సలహాదారులు కేతు రమణారెడ్డి మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి భారత పౌరుడు కలాం గారి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం, జిల్లా వక్త న్యాయవాది ఈక శ్రీనివాసరావు, జిల్లా మహిళా కార్యదర్శి యు. భాగ్యలక్ష్మి, జిల్లా సలహాదారులు అబుల్ రెడ్డి, జిల్లా ప్రతినిధులు శ్రీనివాస్ గుప్తా, శ్రీకాంత్, కాసర్ల లింగం, చాకలింగం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











