ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా కడప జిల్లాలో ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ హరిత తెలిపారు. శుక్రవారం కడప నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ హరిత, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఓ.వి. రాముడుతో కలిసి ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ ప్రక్రియలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్యంగా వంటశాలల పరిశుభ్రత, ఆహారం తయారు చేసే ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పదార్థాలను నిల్వ చేసే విధానం, నిల్వ ఉష్ణోగ్రతలు, గడువు తేదీలు వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు.












