కామారెడ్డి జిల్లా భారత రెడ్‌క్రాస్ సొసైటీ () పాలకమండలిలోని 15 స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల పరిశీలకులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, ఎన్నికల అధికారి టి. ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఎన్నికలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయని అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుల ఆదేశాల మేరకు .. //-2026 ద్వారా నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలను పూర్తిగా రహస్య బ్యాలెట్ పద్ధతిలో, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నామినేషన్ల ప్రక్రియ












