లింగంపేట్ మండలంలోని నాగారం గ్రామ శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు గుట్టమీది సాయిలు (48)ను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు సోమవారం ఈ వివరాలు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నాగారం గ్రామానికి చెందిన మహిళ, కొరుపోలుకు చెందిన సాయిలుతో సుమారు పదేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇటీవల హైదరాబాద్ గుండ్లపోచమ్మ వద్ద ఉంటున్న ఆమెను గ్రామానికి రావాలని సాయిలు పలుమార్లు ఫోన్లో బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ క్రమంలో న భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాల్సి ఉందని చెప్పి ఆమెను గ్రామానికి రప్పించినట్లు తెలిపారు. అనంతరం నాగారం శివారులో ఆమె తలకు తీవ్ర గాయాలతో మృతిచెందినట్లు సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.












