కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలో చోటుచేసుకున్న కలకలం రేపుతోంది. ఆలయ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన 55.72 సవర్ల బంగారు కిరీటం మాయమైనట్లు తనిఖీలో వెల్లడైంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
శబరిమల ఆలయ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన 55.72 సవర్ల బంగారు కిరీటం మాయమైనట్లు తనిఖీలో వెల్లడైంది. ఈ కిరీటాన్ని 2020లో తమిళనాడు భక్తులు సమర్పించారు. అప్పుడు దాని బరువు 445.78 గ్రాములుగా రిజిస్టర్లో నమోదు చేశారు. ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న నకిలీ కిరీటం బరువు కేవలం 240 గ్రాములు మాత్రమే ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయ నిబంధనల ప్రకారం ఒక్క కార్యనిర్వాహక అధికారికి మాత్రమే స్ట్రాంగ్ రూమ్ తెరిచే అధికారం ఉండగా, కిరీటం మాయమవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కిరీటం చోరీకి గురైందా లేక మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.












