కడప నగరంలోని ఆర్కే నగర్లో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం.
మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, ఈస్ట్ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రతి డివిజన్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సంక్షేమ పథకాలు, వైఫల్యాలపై దృష్టి











