వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సతీమణి రాచమల్లు రమాదేవికి కీలక పదవి దక్కింది. వైసీపీ అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ఆమెను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ఆమె ప్రొద్దుటూరు 26వ వార్డు కౌన్సిలర్‌గా సేవలు అందించారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి, పార్టీ అనుబంధ విభాగాన్ని బలోపేతం చేసేందుకు రమాదేవికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పార్టీ శ్రేణుల హర్షం











