సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సుండుపల్లె సీడీపీవో రాజమ్మను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుండుపల్లె, వీరబల్లి మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో ఆమె నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులు అందాయి.
సుండుపల్లెలో 2024లో ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం సుండుపల్లె, వీరబల్లి మండలాల్లోని అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన పౌష్టికాహారం అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ రెండు మండలాలకు కలిపి ఒక సీడీపీవోను నియమించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రెండు మండలాల పరిధిలో మొత్తం 183 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 477 మంది గర్భిణీలు, 431 మంది బాలింతలు, 4,435 మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ కేంద్రాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకులు, పాలు, గుడ్లు, బాలామృతం వంటి ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నాయి.












