అన్నమయ్య జిల్లా మండలం దుద్యాల గ్రామంలోని చిన్నకోడివండ్ల పల్లెలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి భవనాన్ని పరిశీలించి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువగా, వేగవంతంగా అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గ్రామ సచివాలయాల ద్వారా పాలన ప్రజల ముంగిటకే వచ్చిందని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.











