జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. ఉదయం 10 గంటలకు గాంధీజీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలని తీర్మానించినట్లు యాదగిరి తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కలెక్టర్‌కు వినతిపత్రం












