జిల్లా గర్గుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో షెడ్లు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. సన్న రకం ధాన్యం నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానం, ఫిర్యాదుల పరిష్కారానికి సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను ఫ్లెక్సీల ద్వారా స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
48 గంటల్లోపు నగదు జమ












