మండల పట్టణ కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.
అనంతరం గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కుందారపు శ్రీనివాస్ గాంధీజీకి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొహమ్మద్ యూనూస్, సంజయ్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు గడ్డం రవి, మండల కార్యదర్శులు నల్లూరి హరికృష్ణ, పుప్పాల విద్యాసాగర్, పుల్లాయి నవీన్ కుమార్, మార పురుషోత్తం, పిట్ల దయాకర్, సయ్యద్ రియాజ్, గ్రామ ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్, మండల యూత్ ఉపాధ్యక్షులు విక్కీ, మర్కజ్ కమిటీ అధ్యక్షులు మజారుద్దీన్, మాజీ ఉపసర్పంచ్ వాహబ్, దివాన్ వెంకటేష్, షేరు, పిప్పర అశోక్, ఆరిఫ్, మేకా నాగేష్, మేక సతీష్ తదితరులు పాల్గొన్నారు.












