రాయచోటిరాజంపేట ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అక్కడి కోతులకు అరటిపండ్లు అందజేశారు. ప్రయాణంలో భాగంగా కోతులను గమనించిన ఆయన, వాహనం నిలిపి వాటికి ఆహారం అందించారు.
కోతులకు అరటిపండ్లు అందిస్తూ వాటి పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్నారు. మూగజీవుల పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం, దయ, కరుణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన సందేశమిచ్చారు. మనుషులతో పాటు జంతువులు, పక్షుల పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్థానికుల కథనం












