క్యాన్సర్ రోగులకు అత్యంత ఖచ్చితత్వంతో, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆధునిక చికిత్సలు అందించడమే లక్ష్యంగా యశోద హాస్పిటల్స్ లో ల్స్ సోమాజిగూడ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అధునాతన సర్జికల్ పద్ధతులు, రోబోటిక్ సర్జరీ, లాపరోస్కోపిక్ విధానాలతో పాటు మల్టీడిసిప్లినరీ వైద్య సేవల ద్వారా సమగ్ర క్యాన్సర్ చికిత్సను అందిస్తోంది.
క్యాన్సర్ చికిత్సలో భాగంగా లాపరోస్కోపిక్, రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ విధానాలు కీలక పురోగతిగా నిలుస్తున్నాయి. ఈ ఆధునిక పద్ధతులతో చిన్న కోతల ద్వారా క్లిష్టమైన శస్త్రచికిత్సలను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రోఇంటెస్టినల్, కొలొరెక్టల్, బ్రెస్ట్, గైనకాలజికల్ తదితర క్యాన్సర్ల చికిత్సలో వీటిని వినియోగిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతూ, రోగులు త్వరగా కోలుకునేలా చికిత్స అందించడంపై వైద్యులు దృష్టి పెడుతున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ సందర్భంగా సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ లో ల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజీ, లాపరోస్కోపిక్ అండ్ రోబోటిక్ ఆంకో సర్జన్ డాక్టర్ వై. యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో క్యాన్సర్ చికిత్స రోగి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా, మరింత ఖచ్చితత్వంతో నిర్వహించే దిశగా అభివృద్ధి చెందుతోందన్నారు. క్యాన్సర్ను సమర్థవంతంగా తొలగించడంతో పాటు సాధ్యమైనంత వరకు అవయవాల పనితీరును, రోగుల జీవన ప్రమాణాలను కాపాడటం తమ లక్ష్యమని తెలిపారు. మల్టీడిసిప్లినరీ వైద్య బృందాల సమన్వయంతో పాటు రోబోటిక్, లాపరోస్కోపిక్ విధానాలు క్లిష్టమైన క్యాన్సర్లకు మెరుగైన చికిత్స అందించడంలో తోడ్పడుతున్నాయని వివరించారు.












