1996 నాటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన ఎల్ఐసీ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ఎల్ఐసీ శాఖలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగుల వినతిపత్రాలను డివిజన్ మేనేజర్‌కు అందజేశారు.
1997లో హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో సబ్‌స్టాఫ్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, రాత పరీక్ష, ఇంటర్వ్యూతో సహా ఎంపిక ప్రక్రియ 1998లోనే పూర్తయిందని ఉద్యోగులు తెలిపారు. అయితే కోర్టుల్లో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండటంతో నియామకాలు 2012 వరకు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. ఈ ఆలస్యానికి ఉద్యోగులు బాధ్యులు కారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ న జారీ చేసిన కార్యాలయ మెమొరాండం నంబర్ 57/05/2021-() ప్రకారం, 2022కు ముందు ప్రకటించిన ఖాళీలకు న లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేసే అవకాశం ఉందని వారు గుర్తుచేశారు. ఇదే సూత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాలు ఇలాంటి ఉద్యోగులకు వర్తింపజేశాయని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేశవ్యాప్తంగా సమాన హోదాలో ఉన్న ఉద్యోగుల విషయంలో చోటుచేసుకున్న సానుకూల పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా ఎల్ఐసీ (ఉద్యోగుల) పెన్షన్ నిబంధనలు1995 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీఈయూ కామారెడ్డి శాఖ నాయకులు నర్సింలు, నాగేశ్వరరావు, జగన్, సునీల్, భరత్, నైముద్దీన్, చైతన్యతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.












