జిల్లాతో పాటు పలు జిల్లాల్లో విలువైన జాతి కోళ్లను చోరీ చేయడంలో దిట్ట అయిన బోయపాటి హరి చివరకు బాధితుల చేతికి చిక్కాడు. బద్వేల్ పట్టణంలోని విద్యానగర్ లో నివాసం ఉంటున్న హరి విలువైన కోళ్లను లక్ష్యంగా చేసుకుంటూ చోరీలకు పాల్పడుతున్నాడు. ఇటీవల చక్రాయపేటలో 18 కోళ్లు దొంగిలించిన కేసులో అతన్ని పట్టుకున్నారు.
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చక్రాయపేటకు చెందిన ఒక వ్యక్తి ఇంట్లో 18 విలువైన కోళ్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై బాధితులు సొంతంగా ఆరా తీయగా, బద్వేల్ కు చెందిన హరి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దీంతో చక్రాయపేటకు చెందిన బాధితులు శుక్రవారం ఉదయం నుంచి బద్వేల్ లో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు హరిని పట్టుకొని నిలదీయగా, తానే కోళ్లను దొంగిలించినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి 8 కోళ్లను బాధితులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 10 కోళ్ల కోసం అతన్ని తమ వాహనంలో తీసుకెళ్లినట్లు సమాచారం.












