స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సజావుగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల భద్రత, శాంతిభద్రతలు, నియమావళి అమలుపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన చోట్ల పోలీస్ గస్తీ, ఫుట్ పెట్రోలింగ్, ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు











