స్థానిక సంస్థల ఎన్నికల శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో జమ్మలమడుగు పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ ఆధ్వర్యంలో ఈ కవాతు జరిగింది.
జమ్మలమడుగు పట్టణంలోని 17, 18, 19 వార్డుల పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటమే ఈ కవాతు ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా పోలీసులు ఆయా వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని చాటిచెప్పారు.











