కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ప్రారంభించారు. ఈ కేంద్రం హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయానికి అనుబంధంగా పనిచేస్తుందని, ప్రజలకు ఆధార్ నమోదు, ఆధార్ వివరాల సవరణలతో పాటు ఇతర ఆధార్ సంబంధిత సేవలను సులభంగా అందించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఈ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న 14 జిల్లాల్లో కామారెడ్డి 12వ జిల్లాగా నిలిచిందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సాధారణ ఆధార్ కేంద్రాలతో పోలిస్తే ఈ కేంద్రంలో మరిన్ని ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. ఆధార్‌కు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం, నిలిపివేయబడిన ఆధార్ నంబర్లకు సంబంధించిన సమస్యల పరిష్కార ప్రక్రియ వంటి సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని వివరించారు.












