ఢిల్లీలో న జరగనున్న ఇండియా కూటమి ర్యాలీకి తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు కేటాయించాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరాకరించారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బుధవారం ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో న నిర్వహించనున్న ఇండియా కూటమి ఓటు బచావో.. దేశ్ బచావో ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించాలని కోరినప్పటికీ అనుమతి లభించకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. బుధవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, ప్రత్యేక రైళ్ల కేటాయింపుపై సానుకూల నిర్ణయం రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రైళ్లు కేటాయించలేదని వారు ఆరోపించారు. ఈ నిర్ణయం రాజకీయ ప్రేరణతో తీసుకున్నదని విమర్శించారు.












