యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా కన్వీనర్ కోటా సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాయని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్బీ) ఆరోపించింది. ఈ అక్రమాలకు కొమ్ముకాస్తున్న యూనివర్సిటీ అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఏఐఎస్బీ ఆధ్వర్యంలో కడపలో వినూత్న నిరసన చేపట్టారు.
కడపలోని రాజీవ్ పార్క్ వద్ద ఉన్న యోగి వేమన విగ్రహానికి ఏఐఎస్బీ నాయకులు వినతిపత్రం సమర్పించి, యూనివర్సిటీ అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఏఐఎస్బీ రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, అనేక బీఈడీ కళాశాలలు ఒక సిండికేట్‌గా ఏర్పడి విద్యార్థుల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అయినప్పటికీ యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.










