మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ , కడప జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, కడప టూ టౌన్ పరిధిలోని లాడ్జీలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
కడప డి.ఎస్పీ శ్రీమతి భవాని గారి పర్యవేక్షణలో, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎస్.ఐ మధుసూధన్ రెడ్డి, సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. లాడ్జీలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, వారి గుర్తింపు పత్రాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, లాడ్జీలలో బస చేసే వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు.












