కడప జిల్లాలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్, కెమెరామెన్ వెంకటేష్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆయన ప్రస్తుతం కడపలోని గణేష్ న్యూరో కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
వెంకటేష్ గత ఎన్నో ఏళ్లుగా కడప జిల్లాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తూ, తన కెమెరా ద్వారా ఎన్నో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు, ప్రజా సమస్యలను తన కెమెరాలో బంధించి ప్రజలకు చేరవేశారు. వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా జిల్లాలో మంచి గుర్తింపు పొందారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్థిక ఇబ్బందులు












