బాల్కొండ, 10 November
మండలంలోని శ్రీరాంపూర్ గ్రామంలో జలసిరి పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ పద్మ, ఎర్రన్న భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మండలంలోని శ్రీరాంపూర్ గ్రామంలో జలసిరి పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణానికి సర్పంచ్ పద్మ, ఎర్రన్న మంగళవారం భూమి పూజ చేశారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచడమే ఇంకుడు గుంతల ముఖ్య ఉద్దేశమని సర్పంచ్ తెలిపారు. వర్షపు నీటిని వృధాగా పోకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భవిష్యత్తులో సాగునీటి సమస్యలను తగ్గించవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేందర్, కారోబార్ రాజుతో పాటు ప్రజలు పాల్గొన్నారు.












