రాజంపేట, 9 September
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల వ్యవహరించిన తీరును కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని అవమానించడమేనని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్పీకర్‌కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి కామారెడ్డి టౌన్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల వ్యవహరించిన తీరు అత్యంత హేయమైనదని కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్, డీసీసీ జనరల్ సెక్రెటరీ నిమ్మ విజయ్‌కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శాసనసభ ప్రజాస్వామ్యానికి ప్రతీక అని, సభకు పెద్ద అయిన స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని అవమానించడమేనని వారు పేర్కొన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఎలా వ్యవహరించాలో కూడా తెలియడం లేదని విమర్శించారు. స్పీకర్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సేవాదళ్ సహించబోదని హెచ్చరించారు. బీఆర్ఎస్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర సేవాదళ్ అధిష్టానం నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు మెహర్ బాబా గౌడ్, కామారెడ్డి టౌన్ సేవాదళ్ అధ్యక్షుడు సుదర్శన్, మండల సేవాదళ్ అధ్యక్షుడు వేణుచారి తదితరులు పాల్గొన్నారు.











