ఏఎఫ్సీ ఛాలెంజ్ లీగ్ 2026-27 టోర్నీ నుంచి భారత ఫుట్‌బాల్ క్లబ్ ఎఫ్‌సీ గోవా నిష్క్రమించింది. గ్రూప్ సి చివరి లీగ్ మ్యాచ్‌లో కువైట్‌కు చెందిన ఖద్సియా ఎస్సీతో తలపడిన గోవా 1-2 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ శుక్రవారం కువైట్‌లోని హవల్లీలో జరిగింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే ఖద్సియా దూకుడుగా ఆడింది. పదో నిమిషంలో హమ్జా ఖబ్బా గోల్ చేసి తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. రషెద్ అల్ దోసరి అందించిన క్రాస్‌ను అతడు హెడర్‌తో గోల్‌గా మలిచాడు. ఒక గోల్ వెనుకబడిన గోవా తిరిగి పోటీలోకి వచ్చింది. 21వ నిమిషంలో కార్నర్ నుంచి వచ్చిన బంతిని అలెక్స్ జలాయా హెడర్‌తో ముందుకు పంపగా, చికీ సమీపం నుంచి వచ్చిన బంతిని మరో హెడర్‌తో గోల్ సాధించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇరు జట్లు సమాన స్థాయిలో నిలిచాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రెండో అర్ధభాగంలో ఖద్సియా ఆధిక్యం
విరామం తర్వాత ఖద్సియా మరింత దూకుడుగా ఆడింది. 49వ నిమిషంలో హమ్జా ఖబ్బా మరోసారి గోల్ చేసి జట్టుకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. బదర్ అల్ ముతావా సహాయంతో బంతిని అందుకున్న ఖబ్బా, అద్భుతమైన షాట్‌తో గోల్ సాధించాడు. ఆ తర్వాత గోవా స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లభించలేదు. ఖద్సియా కూడా ఆధిక్యాన్ని పెంచుకునే అవకాశాలు సృష్టించింది. 80వ నిమిషంలో అయూబ్ లఖ్దర్ చేసిన షాట్ గోల్‌పోస్ట్‌కు తగలడంతో గోవా ఊపిరి పీల్చుకుంది. చివరి వరకు గోవా మరో గోల్ చేయలేకపోయింది.











