దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చడం వల్ల నిర్లక్ష్యం కారణంగా పలువురు కంటి చూపును కోల్పోయారు, హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి 87 మంది కంటి గాయాలతో చికిత్సకు వచ్చారు.
శస్త్రచికిత్స అవసరమైన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. బోరబండకు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు బాణసంచా పేలడంతో కంటికి గాయమై ఆసుపత్రికి వచ్చాడు. భద్రాచలానికి చెందిన మరో తొమ్మిదేళ్ల బాలుడి కంటికి పేలిన టపాసు ముక్క తగిలింది. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొంతమంది బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇద్దరు పెద్దవారి కంటి చూపు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేయగా, ఒక చిన్నారి కోలుకునే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.











