కామారెడ్డి, 2026-07-31
కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ L. మల్లికార్జున్ గారు ఈరోజు జడ్.పి.హెచ్.ఎస్ కృష్ణాజివాడి, ఎంపీపీ ఎస్ కృష్ణాజివాడి పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, వారిని ప్రోత్సహించే దిశగా సూచనలు చేశారు. ఈ తనిఖీలలో పలువురు ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ L. మల్లికార్జున్ గారు ఈరోజు జడ్.పి.హెచ్.ఎస్ కృష్ణాజివాడి మరియు ఎంపీపీ ఎస్ కృష్ణాజివాడి పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. ప్రతి విద్యార్థి కూడా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని పదవ తరగతిలో మంచి ఫలితాలను సాధించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మరియు ఉపాధ్యాయ బృందంతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి అవసరమైన సలహాలు, సూచనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామస్వామి గారు, ఉపాధ్యాయులు గిర్మా బోయి, శ్వేత, సుజాత, శ్రీహరి, బాబురావు, సంధ్యారాణి, సరిత, రాజారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగుబాయి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
అనంతరం చిట్యాల ఉన్నత పాఠశాలను కూడా ఆయన సందర్శించారు. ఈ తనిఖీలు MEO TADWAI పరిధిలో జరిగాయి.










