కామారెడ్డి, 2026-07-31
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీనిధి కళాశాలలో నూతన పీజీ కోర్సులు ప్రారంభమయ్యాయి. 2026-2027 విద్యా సంవత్సరానికి M.SC జూలోజి, M.A ఇంగ్లీష్ కోర్సులకు అనుమతి లభించిందని కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి తెలిపారు. ఈ కోర్సులు విద్యార్థుల నైపుణ్యాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీనిధి కళాశాలలో నూతన పీజీ కోర్సులు ప్రారంభించినట్లు కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో శ్రీనిధి డిగ్రీ మరియు పీజీ కళాశాలకు 2026-2027 విద్యా సంవత్సరానికి నూతన M.SC జూలోజి మరియు M.A ఇంగ్లీష్ పీజీ కోర్సులు మంజూరు అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచం అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలను మరింత విస్తరిస్తాయని గురువేందర్ రెడ్డి తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబ్ సౌకర్యాలు, డిజిటల్ తరగతి గదులు, కెరీర్ గైడెన్స్ మరియు ప్లేస్మెంట్ శిక్షణతో విద్యార్థులకు సమగ్ర విద్యను అందించేందుకు శ్రీనిధి కళాశాల కట్టుబడి ఉందని ఆయన తెలియజేశారు.
ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, డైరెక్టర్స్ సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, హనుమంతరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










