నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) పరిపాలనా వ్యవహారాల్లో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ జోక్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రిబ్యునళ్ల స్వతంత్రతకు విఘాతం కలిగించేలా నియామక వ్యవస్థను మంత్రిత్వ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంటోందని వ్యాఖ్యానించింది. సిబ్బంది నియామక అధికారాలు ట్రిబ్యునళ్ల అధ్యక్షుల వద్దే ఉండాలని స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గురువారం ఈ అంశంపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన కూడా ఉన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నియామకాలపై అభ్యంతరం
ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీల్లో పరిపాలనా సిబ్బంది నియామక ప్రక్రియను ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న కార్పొరేట్ వ్యవహారాల శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు లేదా 2 నుంచి విధులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని వారి తరఫు న్యాయవాది మీనాక్షి అరోరా కోర్టుకు వివరించారు. ఆ ఉద్యోగులు ఆరేళ్లకు పైగా సేవలందిస్తున్నారని, నియామక నిబంధనల్లో క్రమబద్ధీకరణకు సంబంధించిన అంశాలు ఉన్నాయని ఆమె వాదించారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా వారిని తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు.












