భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ (మై భారత్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 31న జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ (2026-27) ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి () రమేష్ తెలిపారు. ఈ పోటీలకు 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతీ యువకులు అర్హులు.
గురువారం ఆర్.కె. విద్యాసంస్థల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డితో కలిసి పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోటీలు శనివారం ఉదయం 9 గంటలకు కామారెడ్డి నిజాంసాగర్ రోడ్డులోని ఆర్.కె. డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రారంభమవుతాయని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆసక్తి ఉన్నవారు మై భారత్ పోర్టల్‌లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై మూడు నిమిషాల పాటు ప్రసంగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.











