కామారెడ్డి, 3 September
కామారెడ్డి మరియు అన్నారం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. పోసానిపేట మీదుగా నడిచే కొత్త బస్సు సర్వీస్‌ను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. డిపో మేనేజర్ సానుకూల స్పందనతో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈరోజు కామారెడ్డి నుండి అన్నారం వెళ్లే బస్సు వయా పోసానిపేట్ మీదుగా వెళ్తుంది అన్నారం నుండి వయా పోసానిపేట మీదుగా కామారెడ్డి వెళ్తుంది డిపో మేనేజర్ గారిని కోరగా వారు సానుకూలంగా స్పందించి ఈ రోజు బస్సును పంపడం జరిగింది ఈ బస్సు రోజు మధ్యాహ్నం కామారెడ్డి గంటలు11-45 నిమిషాలు నుండి వయా పోసానిపేట మీదుగా అన్నారం వెళ్లి మళ్లీ పోసానిపేట మీదుగా కామారెడ్డి వెళ్తుంది ఈ సందర్భంగా ఈరోజు బస్సు ముందట కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుద్దాల లింగం ఉప సర్పంచ్ అంజయ్య మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి గారు గ్రామ వార్డ్ మెంబర్స్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మహిళలు యువకులు విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము డిపో మేనేజర్ గారికి మరియు సిఐ లింగమూర్తి గారికి కృతజ్ఞతలు తెలిపారు












