కామారెడ్డి, 12 September
కామారెడ్డి విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, నిరంతరాయంగా 18 గంటల విద్యుత్ అందించాలని వారు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన మేర నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు 18 గంటల విద్యుత్ అందించాలని కోరారు. విద్యుత్ సమస్యపై ఇప్పటికే ఎస్ఈని కలిసి వినతిపత్రం అందించినా స్పందన రాలేదని కిసాన్ సంఘ్ నాయకులు తెలిపారు. దీంతో సమస్య పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో రైతులు, కిసాన్ సంఘ్ సభ్యులు పాల్గొని విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఎస్ఈ సాలియా నాయక్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు, ప్రజల విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. ఒకవైపు వినియోగం పెరగడం, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సాలియా నాయక్ పేర్కొన్నారు.












