హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మైండ్‌స్పేస్, నాలెడ్జ్ సిటీ మీదుగా హైటెక్ సిటీ వరకు వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశంపై అధికారులు పరిశీలన చేస్తున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌తో కలిసి శుక్రవారం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. బయోడైవర్సిటీ జంక్షన్, ఐకియా, టీ-వర్క్స్, క్వాల్కమ్, డల్లాస్ సెంటర్ రోడ్ తదితర ప్రాంతాలను అధికారులు పరిశీలించి, అక్కడి పరిస్థితులను అంచనా వేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రతిపాదిత వన్‌వే విధానం
ప్రతిపాదిత వన్‌వే విధానం ద్వారా టీ-హబ్, ఐకియా, నాలెడ్జ్ సిటీ, మైండ్‌స్పేస్ పరిసరాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం ఈ ప్రతిపాదన ముఖ్య లక్ష్యం.











