కామారెడ్డి, 2026-08-12
కామారెడ్డి పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అశోక్‌నగర్ రైల్వే బ్రిడ్జి (రైల్వే కమాన్) నిర్మాణంపై మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. బుధవారం దక్షిణ మధ్య రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులు ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేతో ప్రాజెక్టుకు ఊపు వస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అశోక్‌నగర్ రైల్వే బ్రిడ్జి (రైల్వే కమాన్) నిర్మాణంపై మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. బుధవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఎమ్మార్వోతో పాటు ఇతర శాఖల అధికారులు కలిసి ప్రతిపాదిత రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రాంతంలో సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ సర్వేతో బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం అవుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.











