హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైలులో తరలిస్తున్న 1,286.35 కిలోల మాంసాన్ని ఢిల్లీ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసంలో గోమాంసం ఉండవచ్చన్న అనుమానంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే అది నిజంగా గోమాంసమేనా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.
పోలీసుల వివరాల ప్రకారం, రైల్వే విజిలెన్స్ విభాగానికి అందిన సమాచారం ఆధారంగా హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ (12721) ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చిన 20 థర్మాకోల్ పెట్టెల్లో ఈ మాంసాన్ని గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ పార్సిళ్లను రైల్వే పార్సిల్ సేవల ద్వారా మటన్, మీట్ ఐటమ్స్ పేర్లతో బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే వాటిలో గోమాంసం ఉండవచ్చనే అనుమానంతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ () బృందాన్ని, పశువైద్యుడిని పిలిపించి నమూనాలు సేకరించారు.





