ఔటర్ రింగ్ రోడ్డుపై ఆటోను డీసీఎం ఢీకొనడంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు.
నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ సమీపంలోని అప్పా జంక్షన్ వద్ద ఆటో రిక్షా ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముచ్చింతల్ ప్రాంతంలో పని ముగించుకుని కార్మికులు ఆటోలో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున హిమాయత్‌సాగర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్ ఎగ్జిట్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఆటో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.











