వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణపై వైఎస్ సునీత తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీబీఐ కేవలం నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే ముందుకు వెళ్తోందని, స్వతంత్ర విచారణ జరగడం లేదని ఆమె ఆరోపించారు.
వైఎస్ సునీత మాట్లాడుతూ, సీబీఐ ఎటువంటి లోతైన విచారణ లేకుండానే కేసును ముగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇది సుప్రీంకోర్టు కూడా అంగీకరించే విచారణ కాదని ఆమె అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సాధారణ వ్యక్తులకు వచ్చే సందేహాలు కూడా సీబీఐకి రావట్లేదని, నిందితులతో తాను పోరాడగలనని, కానీ సీబీఐ, పెద్ద వ్యక్తులతో ఎలా పోరాడగలనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.











