కామారెడ్డి, 2026-08-05
జిల్లా పోలీసుల విస్తృత తనిఖీల్లో పలు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర నేర ముఠాను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుల నుంచి రూ.4 వేల నగదు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ వెల్లడించారు.

నేరాల నియంత్రణపై ఎస్పీ ఆదేశాలు
జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల ఆస్తుల రక్షణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ సీఐ నరహరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిర్వహించిన వాహన తనిఖీలు, సాంకేతిక ఆధారాలు, వేలిముద్రల పరిశీలన ద్వారా ఈ అంతర్రాష్ట్ర ముఠాను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఇంటి దొంగతనం కేసు నమోదు