గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కొలెస్ట్రాల్, కొవ్వు పేరుకుపోయి ప్లాక్ ఏర్పడటం వల్ల రక్తనాళాలు ఇరుకుగా మారి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) స్థాయిలను తీవ్రంగా తగ్గించడం ద్వారా ఇప్పటికే ఏర్పడిన ప్లాక్‌ను కూడా తగ్గించవచ్చని తాజా క్లినికల్ అధ్యయనం వెల్లడించింది.
18 నెలల పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో అటోర్వాస్టాటిన్ 40 మి.గ్రా. తీసుకున్న వారిలో 75 శాతం మందికి ప్లాక్ పరిమాణం తగ్గగా, రోసువాస్టాటిన్ 40 మి.గ్రాతో పాటు ఎజెటిమైబ్ 10 మి.గ్రా. కలిపి తీసుకున్న వారిలో 90 శాతం మందికి ప్లాక్ తగ్గినట్లు గుర్తించారు. ఈ రెండు మందుల కలయిక రక్తంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించడంతో పాటు, పేగుల్లో కొలెస్ట్రాల్ శోషణను కూడా అడ్డుకుంటుంది. సాధారణ చికిత్సతో పోలిస్తే మరింత శక్తివంతమైన కొలెస్ట్రాల్ తగ్గింపు చికిత్స గుండె ధమనుల్లో పేరుకుపోయిన ప్లాక్‌ను తగ్గించడంలో మెరుగైన ఫలితాలను ఇచ్చిందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన వివరాలు జామా కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అయితే, మందుల మోతాదును వైద్యుల సలహా లేకుండా మార్చుకోకూడదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










