అమెరికా అంతరిక్ష రంగంలో నైపుణ్యం కలిగిన కొత్త తరం శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దేందుకు యునైటెడ్ స్టేట్స్ స్పేస్ అకాడమీ ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇది దేశంలో తొలి జాతీయ స్థాయి స్పేస్ అకాడమీగా ఏర్పాటు కానుంది.
డాక్సిన్ టైమ్స్: అమెరికా అంతరిక్ష రంగంలో నైపుణ్యం కలిగిన కొత్త తరం శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, అంతరిక్ష సిబ్బందిని తీర్చిదిద్దేందుకు యునైటెడ్ స్టేట్స్ స్పేస్ అకాడమీ ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇది దేశంలో తొలి జాతీయ స్థాయి స్పేస్ అకాడమీగా ఏర్పాటు కానుంది. (నాసా) అంతరిక్ష రంగం అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక అభివృద్ధి, శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక పురోగతికి కీలకమని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ప్రతిపాదిత అకాడమీ సాంకేతిక విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ప్రజాసేవ భావనకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ అకాడమీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక అధ్యక్ష కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మన్ ఈ కమిషన్‌కు అధ్యక్షత వహించనుండగా, నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ మ్యాట్ ఆండర్సన్ కార్యనిర్వాహక డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. అకాడమీ పాలనా విధానం, విద్యార్థుల భవిష్యత్ సేవా బాధ్యతలు, అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేయాలి, అవసరమైన చట్టపరమైన మార్పులు వంటి అంశాలపై కమిషన్ 120 రోజుల్లోగా అధ్యక్షుడికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. నాసా ప్రకారం, భవిష్యత్తులో చంద్రుడిపై మళ్లీ మనుషులను పంపడం, చంద్ర స్థావరాన్ని నిర్మించడం, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను విస్తరించడం వంటి భారీ లక్ష్యాలకు అవసరమైన మానవ వనరులను ఈ అకాడమీ సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










