కామారెడ్డి, 10 September
జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, రోల్ కాల్‌ను క్రమబద్ధంగా నిర్వహించాలని, విధి నిర్వహణ, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్ తనిఖీ.. నాణ్యమైన దర్యాప్తు, విజిబుల్ పోలీసింగ్‌కు ఎస్పీ ఆదేశం జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీసు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా రోల్‌కాల్‌లో పాల్గొని సిబ్బందితో నేరుగా మాట్లాడి విధుల నిర్వహణ, ఉన్నతాధికారుల సూచనల అమలు, టెలీకాన్ఫరెన్స్ ద్వారా అందుతున్న ఆదేశాలు క్షేత్రస్థాయికి చేరుతున్న తీరును పరిశీలించారు. రోల్కాల్ను క్రమబద్ధంగా నిర్వహిస్తూ విధి నిర్వహణ, నేరాల నియంత్రణకు సంబంధించిన అంశాలపై సిబ్బందికి నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, సీసీటీఎన్ఎస్ పనితీరు, స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. పెండింగ్, లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా బీట్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేసి ప్రతి గ్రామంలో నిరంతర నిఘా కొనసాగించాలని, బీట్ అధికారులు ప్రజలతో మమేకమై సమాచార సేకరణపై దృష్టి పెట్టాలని చెప్పారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలతో విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రానున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి, మండపాల ఆన్లైన్ నమోదు, నిమజ్జనాలు, ట్రాఫిక్ నిర్వహణపై సమగ్ర ప్రణాళికతో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో బాన్సువాడ డీఎస్పీ పి. విట్టల్ రెడ్డి, రూరల్ సీఐ తిరుపతయ్య, నిజాంసాగర్ ఎస్హెచ్ఓ శివకుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.












