కామారెడ్డి, 10 September
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది దినోత్సవం అంశం చేంజింగ్ ది నరేటివ్ ఆన్ సూసైడ్ అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వెంకటి తెలిపారు. ఆత్మహత్యలపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, మానసిక సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడే వాతావరణాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆత్మహత్యల నివారణపై విద్యార్థులకు అవగాహన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వెంకటి మాట్లాడుతూ, ఈ ఏడాది ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అంశం "చేంజింగ్ ది నరేటివ్ ఆన్ సూసైడ్" అని పేర్కొన్నారు. ఆత్మహత్యలపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, మానసిక సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడే వాతావరణాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. "మౌనాన్ని వీడదాం.. సంభాషణను ప్రారంభిద్దాం" అనే నినాదంతో అవగాహన కల్పిస్తూ, తీవ్ర నిరాశ, ఒంటరితనం, ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు వంటి హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించి సకాలంలో సహాయం అందిస్తే విలువైన ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, క్రీడలు, సానుకూల దృక్పథం అలవర్చుకోవాలని, చదువు, భవిష్యత్తుపై ఉన్న ఆందోళనలను సరైన ప్రణాళికతో ఎదుర్కోవాలని సూచించారు. మానసిక సమస్యలు ఎదురైనప్పుడు నామోషి పడకుండా కౌన్సెలర్లు, మానసిక వైద్యులను లేదా టోల్‌ఫ్రీ 14416 హెల్ప్‌లైన్‌ను సంప్రదించి సకాలంలో సలహాలు, కౌన్సెలింగ్ పొందాలని తెలిపారు. విద్యార్థులు వైఫల్యాలకు కుంగిపోకుండా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని ఉన్నతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డా. వెంకటస్వామి, డీపీసీ సిద్ది రామేశ్వర్రావు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.












