నిజామాబాద్, 12 September
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, కోటార్మూర్ ప్రాంతాల్లో గత ప్రభుత్వం పద్మశాలి సంఘానికి కేటాయించిన 10 శాతం భూమిని ఎవరూ విక్రయించలేదని పద్మశాలి సంఘం నాయకులు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, కోటార్మూర్ ప్రాంతాల్లో గత ప్రభుత్వం పద్మశాలి సంఘానికి కేటాయించిన 10 శాతం భూమిని ఎవరూ విక్రయించలేదని పద్మశాలి సంఘం నాయకులు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. పట్టణ, మండల పద్మశాలి కళ్యాణ మండపం నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రభుత్వ స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని పద్మశాలి సంఘం నాయకులకు అందించడంతో పాటు ప్రభుత్వం నుంచి రూ.90 లక్షల నిధులు మంజూరు చేయించారని నాయకులు తెలిపారు. ఆ నిధులతో కళ్యాణ మండపం నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ, ప్రహరీ గోడ, వంటగది, మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు సరిపోక పనులు మధ్యలో నిలిచిపోయాయని చెప్పారు. కళ్యాణ మండపం మిగతా పనులను పూర్తి చేసేందుకు పట్టణ, మండల పద్మశాలి కుల బాంధవులు కలిసి అడహాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.50 వేల చొప్పున విరాళాల రూపంలో నిధులు సేకరించి, మండపంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే క్రైమ్ నంబర్ 27 కింద పద్మశాలి కళ్యాణ మండపం వద్దకు వెళ్లి, 10 శాతం భూమి, నిధులు మంజూరు చేయించలేదని, కళ్యాణ మండపం నిర్మాణం పూర్తికాలేదని, కేటాయించిన భూమిలో కొందరు రాజకీయ నాయకులు భూమిని విక్రయించారని ఆరోపణలు చేసినట్లు పద్మశాలి సంఘం నాయకులు తెలిపారు.












