ప్రత్తిపాడు, 11 September
రాజంపేట నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని పార్టీ హైకమాండ్ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. పట్టణంలోని జీఎంసీ కళ్యాణ మండపంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజంపేటలో వైసీపీ సింహగర్జన - స్థానిక ఎన్నికల్లో జెండా మనదే.. డిస్టిక్ బ్యూరో చీఫ్ కడప . రాజంపేట: రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని హైకమాండ్ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. పట్టణంలోని జీఎంసీ కళ్యాణ మండపంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి, జిల్లా పరిశీలకులు కే. సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజంపేటలో ఎగరాల్సింది వైసీపీ జెండానేనని, గ్రూపులు, విభేదాలు వీడి టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. త్వరలో మండలంలో సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలకు ఐడీ కార్డులు ఇస్తామన్నారు. ఆరు మండలాల నాయకులు, మహిళా నేతలు భారీగా పాల్గొన్నారు. అంతకుముందు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు.











