కామారెడ్డి, జూలై 25
ఆటవవహచనేుతైబనేగళుుు.తయనAPKఫైనుఓనచేనఓవయతఖతనుంచనగదుయైనఘటనతుుఅతతంచేశు.ఇంటటజుఅతతంగఉంనూచంచు.
కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు మరోసారి ఆర్టీవో వెహికల్ చలాన్ పేరుతో నకిలీ APK ఫైల్ పంపించి మోసానికి పాల్పడ్డారు. చలాన్ చెల్లించాలని భావించిన ఓ వ్యక్తి తన మొబైల్‌కు వచ్చిన తెలియని APK ఫైల్‌ను ఓపెన్ చేయడంతో సైబర్ నేరగాళ్లు మొబైల్‌పై నియంత్రణ సాధించి, అతని బ్యాంకు ఖాతా నుంచి నగదు కాజేశారు.
మోసాన్ని గుర్తించిన బాధితుడు వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు ప్రారంభించారు.
ఈ ఘటన నేపథ్యంలో కామారెడ్డి పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే APK ఫైళ్లు, లింకులు లేదా యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయకూడదని, ఓపెన్ చేయకూడదని సూచించారు. ప్రభుత్వ శాఖలు, ఆర్టీవో లేదా ఇతర సంస్థలు సాధారణంగా APK ఫైళ్ల ద్వారా చలాన్ నోటీసులు పంపవని తెలిపారు.
సందేహాస్పద సందేశాలు వచ్చిన వెంటనే వాటిని తొలగించాలని, పొరపాటున ఓపెన్ చేసినా లేదా ఆర్థిక లావాదేవీలు జరిగితే ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి, అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి సైబర్ మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.










